G-L53TNVHN5Y ఈ ప్రచారానికి కోడ్ వర్తించదా..? | Praja Shankaravam

ఈ ప్రచారానికి కోడ్ వర్తించదా..?

 

ఆర్మూర్ లో చర్చనీయాంశంగా మారిన బిఆర్ఎస్ బెలూన్ ప్రచారం!

ఆర్మూర్, మే 04 (ప్రజా శంఖారావం):

పార్లమెంట్ ఎన్నికలవేళ ప్రచారంపై ఎన్నికల కమిషన్ ఎంత నిఘా వేసిన తమ ప్రచారానికి అడ్డెవరు అన్న చందంగా మారింది రాజకీయ పార్టీల ప్రచార పరిస్థితి. ఎన్నికల కమిషన్ నిబంధనలను తుంగలో తొక్కుతూ ఆర్మూర్ పట్టణ నట్ట నడిబొడ్డున నిర్మించిన జీవన్ రెడ్డి షాపింగ్ మాల్ పై బిఆర్ఎస్ బెలూన్ ప్రచారంపై పట్టణంలో ఆసక్తికరమైన చర్చ కొనసాగుతుంది. ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఆయా పార్టీల అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ అవగాహన ఏర్పాటు చేసి ప్రచార తీరును వివరించినప్పటికిని తమ కెవి అవి వర్తించవన్నట్టుగా బెలూన్ ప్రచారం చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ అధికారులు జీవన్ రెడ్డి మాల్ పై ఏర్పాటు చేసిన ఈ బెలూన్ ప్రచారంపై ఓ కన్నేయాలని స్థానికులు కోరుతున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజును దీనిపై వివరణ కోరగా బెలూన్ ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు లేవని తెలిపారు. మున్సిపల్ అధికారులకు ఆ బెలూన్ ను తొలగించాల్సిందిగా ఆదేశించినట్టు వివరించారు.

Leave A Reply

Your email address will not be published.