G-L53TNVHN5Y వైద్యుల నిర్లక్షంతో వ్యక్తి మృతి | Praja Shankaravam

వైద్యుల నిర్లక్షంతో వ్యక్తి మృతి

 

* మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన
* ఆసుపత్రి ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం

కోరుట్ల, మే 05 (ప్రజా శంఖారావం):

Relatives are concerned that the reason for the death is the negligence of the doctors .. జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రి లో వైద్యులు అందుబాటులో లేక వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం. కోరుట్ల పట్టణానికి చెందిన ముజ్జు అనే వ్యక్తి చికిత్స నిమిత్తం కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రి కి తీసుకురాగా సకాలంలో డాక్టర్ లు అందుబాటులో లేక ముజ్జు మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. వైద్యులు అందుబాటులో లేకనే చనిపోయాడంటూ ఆసుపత్రిలో బంధువుల ఆందోళన చేశారు. ఆసుపత్రి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. ప్రభుత్వం ఒక వైపు వైద్య సేవలు సామాన్యులకు అందించాలని చెబుతుంటే వైద్యులు మాత్రం ఆసుపత్రికి వచ్చిన రోగులకు అందుబాటులో లేకపోవడం పై ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు సమయపాలన పాటించని వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.