G-L53TNVHN5Y కాలువలో ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు మృతి | Praja Shankaravam

కాలువలో ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు మృతి

మల్లాపూర్, మే 07 (ప్రజా శంఖారావం):

Two youths died after tractor overturned… జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో ఘోర ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. హుస్సేన్ నగర్ శివారులో మొరం తరలిస్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ను తప్పించబోయి అదుపుతప్పి కాలువలోకి దుసుకెళ్ళి ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను ముత్యంపేట గ్రామానికి చెందిన రాజేష్, హుస్సేన్ నగర్ కు చెందిన హైమద్ గా గుర్తించారు. ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. గ్రామ శివారులోనే ఘటన జరగడంతో విషయం తెలుసుకున్న గ్రామస్థులు భారీగా ఘటన స్థలానికి చేరుకున్నారు. యువకుల మృతితో గ్రామాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మెట్పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Leave A Reply

Your email address will not be published.