G-L53TNVHN5Y మాజీ ఎమ్మెల్యేకు ఆర్టీసీ అధికారుల షాక్.. | Praja Shankaravam

మాజీ ఎమ్మెల్యేకు ఆర్టీసీ అధికారుల షాక్..

* జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ కు ఆర్టీసీ అధికారుల హెచ్చరిక
* అద్దె బకాయి 3 కోట్ల 14 లక్షలు చెల్లించకుంటే షాపింగ్ కాంప్లెక్స్ సీజ్
* నేటి సాయంత్రం వరకు గడువు

ఆర్మూర్ టౌన్, మే 09 (ప్రజా శంఖారావం):

Jeevan Reddy is the ultimate RTC officials to own Mall and Multiplex… నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి షాపింగ్ కాంప్లెక్స్ కు ఆర్టీసీ అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. ఆర్టీసీ స్థలంలో లీజుపై విశ్వజిత్ ఇన్ఫాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ వారు నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ అద్దె బకాయి 3 కోట్ల 14 లక్షల రూపాయలు ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. సంబంధిత యజమానుదారులకు అద్దే బకాయి పై నోటీసులు ఇచ్చిన స్పందించడం లేదని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు అద్దె బకాయిలు చెల్లించకుంటే షాపింగ్ కాంప్లెక్స్ ను ఆర్టిసి స్వాధీన పరుచుకుంటుందని ఆర్టీసీ అధికారులు మైక్ అనౌన్స్మెంట్ చేశారు. ఈ సందర్భంగా కాంప్లెక్స్లో అద్దెపై ఉంటున్న దుకాణదారులకు హెచ్చరికలు జారీ చేసినట్లు ఆర్టీసీ అధికారులు వివరించారు. గురువారం సాయంత్రం లోపు అద్దె బకాయిలు చెల్లించని యెడల కాంప్లెక్స్ ను స్వాధీనపరచుకుంటామని ఆర్టీసీ అధికారులు అన్నారు. గతంలో కూడా 7 కోట్ల పైచిలుకు అద్దె బకాయి ఉండడంతో నోటీసులు జారీ చేసి కొంతమేరకు రికవరీ చేశామని, మిగతా డబ్బులు హైకోర్టు ఉత్తర్వుల మేరకు గడువు ఉండడంతో ఇప్పటివరకు వేచి ఉన్నామని తెలిపారు. గడువు ముగిసిన బకాయిలు చెల్లించకపోవడంతో తిరిగి నోటీసులు జారీ చేసి హెచ్చరించినట్లు అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.