G-L53TNVHN5Y జిల్లాలో దారుణ ఘటన… | Praja Shankaravam

జిల్లాలో దారుణ ఘటన…

* ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన

* అమ్మాయిపై నలుగురు యువకుల అత్యాచారం

* పోలీసుల అదుపులో ఆ నలుగురు యువకులు

కరీంనగర్ జిల్లా ప్రతినిధి, మే15 (ప్రజా శంఖారావం):

The girl was raped by four youths… ఇంస్టాగ్రాంలో ప్రేమిస్తున్నానంటూ బాలికను ట్రాప్ చేసిన యువకుడు. ఆ అమ్మాయితో సన్నిహితంగా ఉన్న ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారానికి పాల్పడిన ఘటన జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఓ బాలికపై ఏడాదిన్నరగా కొందరు యువకులు అత్యాచారానికి పాల్పడుతున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసు స్టేషనులో ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగు చూసింది. ఆ అమ్మాయి ప్రవర్తనపై వచ్చిన మార్పుతో కుటుంబ సభ్యులు ఆ అమ్మాయిని ప్రశ్నించగా తనకు జరిగిన ఘటన గురించి చెప్పింది. ఏ ఘటనకు పాల్పడిన యువకుల గురించి అమ్మాయిని నిలదీయడంతో ఆ నలుగురు యువకుల వివరాలు వెల్లడించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. బంధువులు ఆ బాలికతో కలిసి కరీంనగర్ కమిషనరేట్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.