G-L53TNVHN5Y హత్యాచారం కేసులో కఠిన కారాగార శిక్ష | Praja Shankaravam

హత్యాచారం కేసులో కఠిన కారాగార శిక్ష

 

కోరుట్ల, మే 15 (ప్రజా శంఖారావం):

Strict imprisonment in case of murder… కోరుట్ల మండలం ఎకిన్పూర్ గ్రామానికి చెందిన ఎల్లాల తుకారాం తన మైనర్ కూతురు పై లైంగిక దాడి చేసిన ఘటనలో బుధవారం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జ్ ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ ఫోక్సో కోర్టు జగిత్యాల నీలిమ నిందితునికి హత్యాచారం కేసులో కఠిన కారగార శిక్ష అమలు చేస్తూ తీర్పునిచ్చారు. నిందితునికి 25 సంవత్సరాల కఠినకారగార శిక్ష, ₹ 10వేల జరిమానా, 3 లక్షల రూపాయల పరిహారాన్ని బాధితురాలికి ఇవ్వాల్సిందిగా తీర్పు జారీ చేశారు. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కే.రాజశేఖర్ రాజు, కోర్టు పి. పి. జె. మల్లికార్జున్, లైజనింగ్ ఆఫీసర్ జి.రాజునాయక్ ఎస్ఐ, కోర్టు కానిస్టేబుల్ బి.రాజు, నీల నాయక్ లను జగిత్యాల ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.