G-L53TNVHN5Y జీవన్ మాల్ సీజ్..! | Praja Shankaravam

జీవన్ మాల్ సీజ్..!

– మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్ కు తాళం వేసిన అధికారులు
– మాల్ బకాయిలు చెల్లించాలని నోటీసులు
– బకాయిలు చెల్లించకపోవడంతో మాల్ స్వాధీనంలో ఉన్నట్లు ప్రధాన గేటుకు నోటీస్

ఆర్మూర్ టౌన్, మే 16 (ప్రజా శంఖారావం):

గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాజీ ఎమ్మెల్యే కు వరుస షాక్ లు తగులుతున్నాయి. వ్యాపార పరంగా షాపింగ్ కాంప్లెక్స్ కు ఆర్టీసి అధికారులు నోటీసులు జారీ చేస్తుంటే, ఆయన అనుచరులు ఒక్కొక్కరుగా ప్రధాన పార్టీలో చేరడం ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. నిజమాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ లీజు స్థలంలో విశ్వజిత్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి పేరుతో నిర్మించిన జీవన్ రెడ్డి మాల్ బకాయిలు చెల్లించాలని అసెంబ్లీ ఎన్నికల అనంతరం వారికి మొదటి నోటీసు అందించిన ఆర్టీసీ అధికారులు ఎట్టకేలకు పార్లమెంటు ఎన్నికల తర్వాత ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి చెందిన జీవన్ మాల్ కు తాళం వేశారు. గతంలో 7కోట్ల పై చీలుకు అద్దె బకాయిలు ఉండగా అసెంబ్లీ ఎన్నికల అనంతరం జారీ చేసిన నోటీసులతో సుమారు 5 కోట్ల మేర అద్దె బకాయిలు చెల్లించగా, మిగతా 2.5 కోట్ల అద్దె బకాయి ఉందని ఆర్టీసి అధికారులు వివరించారు. గురువారం ఉదయమే జీవన్ మాల్ లోకి వచ్చిన ఆర్టీసీ అధికారులు సాయంత్రం లోగా దుకాణాలను ఖాళీ చేయాలని ప్రకటించారు. ప్రకటించిన విధంగానే సాయంత్రం మాల్ లో ఉన్న వారిని బయటకు పంపి ప్రధాన గేటుకు తాళం వేసి సీజ్ చేశారు. గత వారం క్రితం ఆర్టీసీకి బకాయిలు చెల్లించాలని ఆర్టీసీ అధికారులు అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో ఆర్టిసి ఎండి సజ్జనర్ పై మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆపైన ఆర్టీసీ అధికారులు జీవన్ మాల్ గేటుకు తాళం వేసి తమ స్వాధీనంలో ఉందని హెచ్చరిక తో కూడిన ఫ్లెక్సిని అతికించారు.

Leave A Reply

Your email address will not be published.