G-L53TNVHN5Y ప్రేమ పేరుతో కిలాడి లేడి మోసం… | Praja Shankaravam

ప్రేమ పేరుతో కిలాడి లేడి మోసం…

 

కరీంనగర్ జిల్లా ప్రతినిధి, మే 17 (ప్రజా శంఖారావం):

ప్రేమ పేరుతో ఓ యువకుడిని మోసం చేసి 16 లక్షలతో ఉడాయించిన కిలాడి లేడి ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఆ కిలాడి లేడిపై బాధితుడు మాదని నాగరాజు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. బాధితుని తండ్రి మాదని మల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కేంద్రానికి చెందిన మాదని నాగరాజు తమిళనాడులోని కోయంబత్తూర్ లో ఇషా ఫౌండేషన్ లో ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ సంధ్య ప్రియాంక అనే యువతితో ఆయనకు పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారి సహజీనం వరకు వెళ్లింది. కొంత కాలం గడిచాక నాగరాజు ఆ యువతిని పెళ్లి చేసుకోవాలని కోరాడు. అందుకు ఆమె కాలం వెళ్లదీస్తూ అతన్ని నమ్మబలికింది. తిమ్మాపూర్ లో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నారు. కొద్ది రోజుల పాటు కాపురం కూడా చేశారు. పెళ్లి చేసుకోవాలని ప్రియుడు నాగరాజును కోరింది. పెళ్లి కోసం బంగారం కొనాలంటూ అతని వద్ద దశల వారీగా 16 లక్షల తీసుకొని మళ్లీ వస్తానంటూ ఆస్ట్రేలియా వెల్లింది. దీంతో తిరిగి తన ప్రియురాలు రాకపోవడంతో ప్రియుడు ఇటీవల పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. నాగరాజు ఆరోగ్యం మెరుగయ్యాక మళ్ళీ ప్రియురాలు ఫోన్ చేస్తూ తన పేరిట 2 ఎకరాల ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తే తమను పెళ్లి చేసుకుంటానంటూ ఫోన్ చేసి వేదిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై బాధితుని తండ్రి స్థానిక ఎల్ఎండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.