G-L53TNVHN5Y ఉలిక్కిపడ్డ పట్టణ వాసులు | Praja Shankaravam

ఉలిక్కిపడ్డ పట్టణ వాసులు

 

మెట్ పల్లి, మే 21 (ప్రజా శంఖారావం):

పట్టణ కేంద్రంలో వివాహిత అనుమానస్పద మృతి ఘటన చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా పట్టణవాసులు ఉలిక్కిపడ్డారు. వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి ఏరియాలో వివాహిత అనుమాన స్పద స్థితిలో మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి మృతురాలిని సింగం మమత (45) గా ప్రాథమికంగా గుర్తించారు. మృతికి గల కారణాలు ఏంటి అన్న కోణంలో పోలీసు అధికారులు విచారణ చేపట్టారు. వివాహిత హత్యతో ఒక్కసారి కాలనీ, పట్టణ వాసులు భయందోనాలకు గురయ్యారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Leave A Reply

Your email address will not be published.