G-L53TNVHN5Y చెట్టును ఢీకొన్న కారు తండ్రి కొడుకుల మృతి | Praja Shankaravam

చెట్టును ఢీకొన్న కారు తండ్రి కొడుకుల మృతి

చెట్టును ఢీకొన్న కారు

 

 

జగిత్యాల జిల్లా ప్రతినిధి, మే 22 (ప్రజా శంఖారావం):

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో అదుపు తప్పి కారు చెట్టును ఢీకొన్న ఘటనలో తండ్రి కొడుకులు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… మెట్ పల్లి పట్టణం ఎస్ ఆర్ ఎస్పీ క్యాంప్ కాలనికి చెందిన రిటైర్డ్ ఎంప్లాయ్ ఖైరుద్దిన్, రషీద్ లు ఇద్దరు కరీంనగర్ నుండి మెట్ పల్లి తిరుగు ప్రయాణంలో మేడిపల్లి మండలంలో కారు అదుపు తప్పి చెట్టును డికొంది. ఈ ఘటనలో తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో తండ్రి రిటైర్డ్ ఉద్యోగి కాగా, మృతుని కొడుకు టీచర్ గా పనిచేస్తున్నారు. మృత దేహాలను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి తరలించినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీస్ లు ఘటన స్థలానికి చేరుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.