G-L53TNVHN5Y అద్దె కారు తెచ్చిన ”అర్ధరాత్రి ఉద్రిక్తత” | Praja Shankaravam

అద్దె కారు తెచ్చిన ”అర్ధరాత్రి ఉద్రిక్తత”

 

* కర్రలు, రాళ్లతో దాడులు
* రంగ ప్రవేశం చేసిన పోలీసులు అదుపులో పలువురు
* ఇరు వర్గాల ఘర్షణతో ఉద్రిక్త వాతావరణం
* క్షతగాత్రునికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స

అద్దెకారు తెచ్చిన అర్ధరాత్రి ఉద్రిక్తతతో ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో ఇరు వర్గాల వారిని అక్కడి నుండి తరిమేసి గొడవను సర్దుమనిపించారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని పెర్కిట్ కు చెందిన అద్దెకారుల నిర్వహకుడు అవసరాల నిమిత్తం అద్దెకు ఇచ్చే సమీర్ వద్ద నుండి ఒక వ్యక్తి కారును అద్దెకు తీసుకొని వెళ్లాడు. తిరిగి కారు ఇచ్చే సమయంలో అద్దెకు తీసుకున్న కారు డ్యామేజ్ కావడంతో సదరు అద్దెకారుల నిర్వాహకుడు కారును బాగు చేయించి ఇవ్వాలని సూచించాడు. దీంతో కారు రిపేరు విషయమై మాట్లాడదామని అద్దె కారు తీసుకున్న వ్యక్తులు సమీర్ ను పిలిచి దాడి చేశారని బాధితుని స్నేహితులు తెలిపారు. దీంతో బాధితుని తరపు వారు ఎదుటివారితో ఘర్షణకు దిగడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు కొందరు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్మూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాల వారిని అక్కడ నుండి పంపించేశారు. అనంతరం గాయాల పాలైన క్షగాత్రున్ని చికిత్స నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.