G-L53TNVHN5Y రహదారిపై రైతుల రాస్తారోకో | Praja Shankaravam

రహదారిపై రైతుల రాస్తారోకో

 

రాయికల్, మే 23 (ప్రజా శంఖారావం):

వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ గురువారం రైతులు రహదారిపై కూర్చొని ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. రాయికల్ మండలం రామాజీపేట గ్రామంలో రైతులు వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఐకేపీ సెంటర్ కి వడ్లు తీసుకువచ్చి నెల రోజులు గడుస్తున్నా వడ్లు కొనుగోలు చేయటం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాల వల్ల వడ్లు తడిచి మొలకలు వచ్చి నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం పండించిన పంట చేతికి వచ్చేసరికి కొనుగోలు జరగక, వర్షాలకు తడిసి తాము నష్టపోతున్నామని, ప్రభుత్వం స్పందించి వెంటనే తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.