G-L53TNVHN5Y తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం | Praja Shankaravam

తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం

 

* ఒకరు అక్కడికక్కడే మృతి
* మరొకరి పరిస్థితి విషమం

 

ఇబ్రహీం పట్నం, మే 23 (ప్రజా శంఖారావం):

Fatal road accident in the early morning.. తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం రహదారి పై లారీని కారు ఢీకొన్న ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… మెట్ పల్లి పట్టణానికి చెందిన శివరామకృష్ణ తన కొడుకు అక్షయ్ తో తెల్లవారు జామున నిజామాబాద్ నుండి తిరుగు ప్రయాణంలో ఇబ్రహీంపట్నం మండలం బండలింగాపూర్ గండి హనుమాన్ దేవాలయం శివారులో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. స్థానికులు 108కు సమాచారం ఇవ్వగా అప్పటికే కొడుకు అక్షయ్ మరణించినగా, శివరామకృష్ణకు రెండు కాళ్ళు, ఒక చేయి విరిగిందని ఆయన పరిస్థితి కూడా విషమంగా స్థానికులు చెబుతున్నారు. క్షతగాత్రున్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Leave A Reply

Your email address will not be published.