G-L53TNVHN5Y బస్సు అదుపుతప్పి బోల్తా | Praja Shankaravam

బస్సు అదుపుతప్పి బోల్తా

 

* 50 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు
* 25 మందికి గాయాలు
* ఇద్దరి పరిస్థితి విషమం
* క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు

 

సారంగపూర్, మే 23 (ప్రజా శంఖారావం):

Private Travels bus overturned.. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం మహబూబ్ ఘాట్స్ పై ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తున్న ముస్కాన్ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో 25 మందికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులను హైదరాబాద్ తరలిస్తుండగా ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఫర్హనా (28) మహిళ మృతి చెందినట్లు సమాచారం. గాయాలైన క్షతగాత్రులను నిర్మల్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.