G-L53TNVHN5Y జాతీయ రహదారి 63 పై రెండు లారీలు “ఢీ” | Praja Shankaravam

జాతీయ రహదారి 63 పై రెండు లారీలు “ఢీ”

 

* ఇద్దరికీ తీవ్ర గాయాలు
* ఒక లారీ పూర్తిగా దగ్ధం
* దగ్ధమవుతున్న లారీ లోంచి ఇద్దరిని కాపాడిన స్థానికులు

ఆర్మూర్ టౌన్, మే 24 (ప్రజా శంఖారావం):

జాతీయ రహదారి 63 పై రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఒక లారీ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ప్రాణాపాయ స్థితి నుండి ఇద్దరిని స్థానికులు కాపాడారు. వివరాల్లోకి వెళితే… నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని పెర్కిట్ శివారులో జాతీయ రహదారి 63పై గుజరాత్ నుండి విశాఖపట్నం వైపు గ్రానైట్ లోడుతో వెళ్తున్న లారీ, కరీంనగర్ నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్న మరో లారీని ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో గ్రానైట్ లోడ్ తో వెళ్తున్న లారీ పూర్తిగా దగ్ధమైంది. ఆ సమయంలో చాకచక్యంగా వ్యవహరించిన డ్రైవర్ కిందకు దూకి ప్రాణాలు కాపాడుకోగా, మిగతా ఇద్దరు క్యాబిన్లో ఉన్న సమయంలో మంటలు వ్యాపించడంతో స్థానికులు వారిని కాపాడారు. కరీంనగర్ నుండి నిజాంబాద్ వైపు వెళ్తున్న లారీ డ్రైవర్ కి కాలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రవికుమార్ తో పాటు ఎస్ఐ అశోక్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది దగ్ధమవుతున్న లారీ మంటలను ఆర్పి వేశారు. అనంతరం స్తంభించిన ట్రాఫిక్ ను పోలీసులు క్లియర్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.