G-L53TNVHN5Y కారు బైక్ ఢీకొని ఒకరి మృతి | Praja Shankaravam

కారు బైక్ ఢీకొని ఒకరి మృతి

 

మల్లాపూర్, మే 29 (ప్రజా శంఖారావం):

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో కారు ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మల్లాపూర్ మండలం నడికుడ గ్రామ శివారులో మోటర్ సైకిల్ పై వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొనడంతో మోటార్ సైకిల్ పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు చెప్పారు. మృతుడు ఉత్తరప్రదేశ్ కు చెందిన దీపక్ (32)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీస్ లు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.