G-L53TNVHN5Y రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం | Praja Shankaravam

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

 

* టిప్పర్ లారీ ఢీకొని ఒక ఘటనలో ఒకరు మృతి
* NH 63 పై ఇసుక లారీ ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలు

ఆర్మూర్ టౌన్, మే 31 (ప్రజా శంఖారావం)

వేరువేరుగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని పెర్కిట్ శివారు జాతీయ రహదారి 63 పై ఇసుక లారీని ఢీకొన్న ఘటనలో అల్లెపు నర్సయ్య (60), అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన స్థలానికి ఏఎస్ఐ చిన్నయ్య చేరుకొని పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఆర్మూర్ మండలం ఇసాపల్లి గ్రామ శివారులో టిప్పర్ లారీ ఢీకొని మరొకరు ఉమ్మేడ ఆశన్న (65) మృతి చెందిన ఘటన చోటు చేసుకున్నట్లు ఆర్మూర్ ఎస్సై అశోక్ తెలిపారు బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతదేహాన్ని ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.