G-L53TNVHN5Y ఎండ వేడికి ఘోర అగ్ని ప్రమాదం | Praja Shankaravam

ఎండ వేడికి ఘోర అగ్ని ప్రమాదం

 

* భానుడి ప్రతాపానికి ఆహుతైన ద్విచక్ర వాహనాలు
* 20 ద్విచక్ర వాహనాలు దగ్ధం

జగిత్యాల జిల్లా ప్రతినిధి, మే 31 (ప్రజా శంఖారావం):

Vehicles burned in the sun… భానుడి ప్రతాపం రోజు రోజుకి భయాందోళన కలిగిస్తుంది. పశుపక్షాదులు సైతం బానుడి ప్రతాపం ముందు విలవిలలాడున్నాయి. భానుడి ప్రతాపం ముందు ప్రమాదవశాత్తు 20 ద్విచక్ర వాహనాలు దగ్ధమైన ఘటన. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదంచోటు చేసుకుంది. పట్టణ బైపాస్ రోడ్ లో అన్వేష్ అనే మెకానిక్ కు చెందిన ఇంటి ఆవరణలోని మెకానిక్ షెడ్డులో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. భానుడి ప్రతాపానికి 20 ద్విచక్ర వాహనాలు దగ్దమయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ లు ఘటన పై విచారణ చేపట్టారు.

Leave A Reply

Your email address will not be published.