G-L53TNVHN5Y చైన్ స్నాచింగ్ కలకలం | Praja Shankaravam

చైన్ స్నాచింగ్ కలకలం

* 3 తులాల బంగారు గొలుసు అపహరణ
* బాధితురాలికి తీవ్ర గాయాలు
* పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

ఆర్మూర్ టౌన్, జూన్ 01 (ప్రజా శంఖారావం):

Chain snatching disturbance … Abduction of 3 tala gold chain… ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ 43వ నెంబర్ జాతీయ రహదారి పై శనివారం సాయంత్రం ఓ మహిళ మెడలో నుంచి 3 తులాల బంగారు గొలుసును గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుల వివరాల ప్రకారం. మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన జిల్లా లక్ష్మీ తన భర్తతో కలిసి బైకుపై మాక్లూర్ మండలం మదనపల్లి గ్రామానికి తమ బంధువుల ఇంటికి వెళ్లారు. సాయంత్రం తిరిగి మోర్తాడ్ వస్తున్న సమయంలో జాతీయ రహదారి పక్కన ఉన్న డంపింగ్ యాడ్ వద్ద పల్సర్ బైక్ పై గుర్తు తెలియని ముగ్గురు వచ్చి లక్ష్మి మెడలో నుంచి 3 తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లినట్లు బాధితులు వాపోయారు. ఈ ఘటనలో బాధితురాలి మెడలోంచి బంగారు గొలుసు లాగడంతో బైక్ పైనుంచి పడడంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

Leave A Reply

Your email address will not be published.