G-L53TNVHN5Y కత్తిపోట్ల కలకలం… | Praja Shankaravam

కత్తిపోట్ల కలకలం…

 

* రెండు కుటుంబాల మధ్య ఘర్షణ
* కత్తులతో దాడి
* ఒకరి పరిస్థితి విషమం

కోరుట్ల, జూన్ 03 (ప్రజా శంఖారావం):

రెండు కుటుంబాల మధ్య చిన్నపాటి ఘర్షణ కత్తులతో దాడి చేసుకునే పరిస్థితికి దారితీసింది. వివరాల్లోకి వెళితే కోరుట్ల పట్టణ కేంద్రంలోని హాజీపుర కాలనిలో ఓఇంట్లో ఇరు కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి. అద్దె ఇంటిలోని బాత్ రూం కోసం రెండు కుటుంబాల మద్య గొడవ జరిగింది. ఒక కుటుంబానికి చెందిన మహ్మద్ పాషా మరో వ్యక్తి మొయినొద్దిన్ ఘర్షణ సమయంలో మాటమాట పెరిగి కత్తితో మెడ పై దాడి చేయగా చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో మొయినొద్దికు తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. ఆయన పరిస్థితి విషమించడంతో కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.