G-L53TNVHN5Y కూలర్ షాక్ తో బాలిక మృతి | Praja Shankaravam

కూలర్ షాక్ తో బాలిక మృతి

 

ఆర్మూర్ టౌన్, జూన్ 07 (ప్రజా శంఖారావం):

నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన మహేష్, సౌందర్యల కూతురు సింధూర (05) ప్రమాదవశాత్తు కూలర్ కరెంట్ షాక్ తో మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వేసవి సెలవులు ఉండడంతో 3రోజుల క్రితం తల్లిదండ్రులతో కలిసి సిందూర నిజామాబాద్ నుండి ఆలూరు గ్రామంలో ఉంటున్న అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది. శుక్రవారం సాయంత్రం ఇంట్లోవారాంత ఆరు బయట కూర్చుండగా, ఇంట్లో ఐదు సంవత్సరాల బాలిక సిందూర ఆడుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు కూలర్ వద్ద కరెంట్ షాక్ తగిలి పడిపోయిందన్నారు. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆర్మూర్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. ఐదు సంవత్సరాల కూతురు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతురాలు బాలిక తల్లితో కలిసి ఇన్స్టాగ్రామ్ లో రిల్స్ చేస్తూ అల్లరిగా ఆడుతూ పాడుతూ కళ్ళ ఎదుట తిరిగేదని తల్లిదండ్రులు వాపోయారు.

Leave A Reply

Your email address will not be published.