G-L53TNVHN5Y ఎంపిటిసి పై నోరు జారిన ఎమ్మెల్యే | Praja Shankaravam

ఎంపిటిసి పై నోరు జారిన ఎమ్మెల్యే

 

* అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని ఎంపిటిసి ఆవేదన
* రసాభాసగా మారిన సర్వసభ్య సమావేశం
* తప్పు తెలుసుకుని మాట వెనక్కి తీసుకున్న ఎమ్మెల్యే

మెట్ పల్లి, జూన్ 14 (ప్రజా శంఖారావం):

In the meeting, MLA’s mouth slipped on MPTC… కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ పై స్థానిక కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ నోరు జారారు. శుక్రవారం జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండల కేంద్రంలోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మండల సర్వ సభ్య సమావేశంలో గందరగోళం నెలకొంది. సర్వసభ్య సమావేశంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతుండగా మేడిపల్లి ఎంపీటీసీ నగేష్ మాట్లాడుతూ అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అదే సమయంలో ఎమ్మెల్యే ఆయన ఒక ఎంపీటీసీ అని మరిచి ఎమ్మెల్యే అయిన నేను చెప్పేవరకు వినే సంస్కారం నీకు లేదా అని ఎంపీటీసీ పై విరుచుకుపడ్డారు. ఆ సమయంలో కాస్త గందరగోళం నెలకొంది. దానికి ఎంపీటీసీ స్పందిస్తూ ఎమ్మెల్యే అయి ఉండి మీరు ఇలా మాట్లాడడం సరి కాదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే తాను ఎంపీటీసీ పై చేసిన మాటలను వెనక్కి తీసుకుంటున్నానని అన్నారు. గతంలో బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన మేడిపల్లి ఎంపీటీసీ నగేష్ మొన్న జరిగిన ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Leave A Reply

Your email address will not be published.