G-L53TNVHN5Y యువకుడి పై గొంతు కోసి దాడి | Praja Shankaravam

యువకుడి పై గొంతు కోసి దాడి

* జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

* యువకుని పరిస్థితి విషమం

* సీసీ ఫుటేజీ ఆధారంగా వివరాలు సేకరిస్తున్న పోలీసులు

ఆర్మూర్ టౌన్, జూన్ 15 (ప్రజా శంఖారావం):

 

Attack on the youth, the condition of the youth is serious in the hospital… ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని సిద్దులగుట్ట వెనకాల ఉన్న అటవీ శాఖ అధికారి కార్యాలయం వద్ద యువకుడి పై గొంతు కోసి దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. బీహార్ కు చెందిన సోను కుమార్ పై అటవీశాఖ కార్యాలయం వెనుక ప్రాంతంలో శనివారం సాయంత్రం జరిగింది. ఒంటినిండా గాయాలతో రోడ్డుపైకి వచ్చిన యువకుని ఒంటిపై రక్తపు మరకలతో ఉండడంతో స్థానికులు 108 సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది అంబులెన్స్ లో క్షతగాత్రుడిని జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సోను కుమార్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా యువకునిపై కొంతమంది బీరు సీసాతో దాడి చేసి గొంతు కోసి గాయపరిచినట్లు సమాచారం?. స్థానిక ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ రవి కుమార్ ను ఈ ఘటనపై వివరణ కోరగా అటవీశాఖ కార్యాలయంలోని సీసీ కెమెరాలు పరిశీలించి ఘటనకు కారణాలు తెలుసుకుంటున్నామని చెప్పారు. దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.