G-L53TNVHN5Y అన్నపై తమ్ముడు కత్తితో దాడి | Praja Shankaravam

అన్నపై తమ్ముడు కత్తితో దాడి

 

* చికిత్స పొందుతు రాజేష్ మృతి…
* అన్న దమ్ముల మధ్య ఆస్తి తగదాలు…
* కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రాకేష్ పై కేసు నమోదు

కోరుట్ల, జూన్ 17 (ప్రజా శంఖారావం):

అన్న దమ్ముల మధ్య ఆస్థి దగదాలతో అన్న మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహనరావ్ పేట గ్రామానికి చెందిన కోట రాజేష్, కోట రాకేష్ అన్నదమ్ముల మధ్య ఆదివారం ఆస్తి గొడవ మొదలయ్యింది. ఈ గొడవలో అన్న రాజేష్ పై తమ్ముడు రాకేష్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. గతంలో భువివాదంతో పలుమార్లు గొడవలు అయి సర్దు మనిగాయి. కానీ ఆదివారం రాత్రి చోటు చేసుకున్న గొడవలో అన్నపై తమ్ముడు కత్తితో దాడి చేసిన ఘటనలో రాజేష్ కు తలపై, కడుపులో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. పరిస్థితి విషమించడంతో జిల్లా ఆసుపత్రి కి తరలించి అక్కడనుండి హైదరాబాద్ తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయాడని మృతుని భార్య తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రాకేష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కోరుట్ల ఎస్ఐ చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.