G-L53TNVHN5Y రెండు దేవాలయాల్లో చోరీ | Praja Shankaravam

రెండు దేవాలయాల్లో చోరీ

* ఒక ఆలయంలో హుండీలోని నగదు అపహరణ

* మరో ఆలయంలో హుండీ ధ్వంసానికి విఫలయత్నం

ఆర్మూర్ టౌన్, జూన్ 17 (ప్రజా శంఖారావం):

ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని తిరుమల కాలనీలోని హనుమాన్ ఆలయం, వెంకటేశ్వర ఆలయాల్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. కాలనీవాసులు తెలిపిన వివరాల ప్రకారం హనుమాన్ ఆలయంలోని హుండీని పగులగొట్టి నగదును అపహరించారని, వెంకటేశ్వర ఆలయంలోని హుండీని ధ్వంసం చేయడానికి విఫలయత్నం చేశారని తెలిపారు. ఈ మేరకు స్థానిక ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు కాలనీవాసులు చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.