G-L53TNVHN5Y భారీగా నిల్వచేసిన ఇసుకడంపుల స్వాధీనం | Praja Shankaravam

భారీగా నిల్వచేసిన ఇసుకడంపుల స్వాధీనం

* దాదాపు 200 వందల ఇసుక డంపులను సీజ్ చేసిన మైనింగ్ అధికారులు
* వాటి విలువ సుమారు 2 లక్షల పైచిలుక అని వెల్లడి
* అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు

కోరుట్ల, జూన్ 21 (ప్రజా శంఖారావం):

జగిత్యాల జిల్లాలో భారీగా నిల్వ చేసిన ఇసుక డంపులను మైనింగ్ శాఖ అధికారులు స్వాధీనపరచుకున్నారు. కోరుట్ల మండలం నాగులపేట గ్రామ శివారులో భారీగా అక్రమ ఇసుక నిల్వలు ఉన్నాయన్న సమాచారం అందుకున్న మైనింగ్ అధికారులు గ్రామ శివారులో ఉన్న దాదాపు 200 ట్రిప్పుల ఇసుక డంపులను స్వాదినపరుచుకుని సీజ్ చేశారు. అక్రమ ఇసుక నిల్వల విలువ దాదాపు 2 లక్ష పైచిలుకు ఉంటుందని కోరుట్ల తాహసిల్దార్ కిషన్ వెల్లడించారు. అక్రమ ఇసుక రవాణా చేపడితే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. మైనింగ్ అధికారులు స్వాధీనం చేసుకున్న ఇసుక డంపులను రెవెన్యూ సిబ్బంది స్వాధీనం చేసుకున్నమని, ఉన్నతాధికారులకు నివేదికను అందజేసి సంబంధికులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తాసిల్దార్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.