G-L53TNVHN5Y ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య | Praja Shankaravam

ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య

 

*ప్రేమ వివాహం చేసుకున్న ఎమ్మెల్యే
*అల్వాల్ లోని పంచశీలలో చోటు చేసుకున్న ఘటన

చొప్పదండి, జూన్ 21 (ప్రజా శంఖారావం):

MLA’s wife committed suicide…హైదరాబాద్ అల్వాల్ లోని పంచశీల కాలనీలో కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే ఇంట్లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య ఆత్మహత్య ఘటన కలకలం సృష్టించింది. ఎమ్మెల్యే ఆయన భార్య రూపాదేవిల వివాహం ప్రేమ వివాహం. ఆమె వికారాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. వీరికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలతో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. మనస్థాపం చెందిన రూపా దేవి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. గత కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి వారు తిరుమలతో పాటు పలు పుణ్యక్షేత్రాలు సందర్శించారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆమె మృతదేహాన్ని కొంపల్లి లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

Leave A Reply

Your email address will not be published.