G-L53TNVHN5Y విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..! | Praja Shankaravam

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..!

* పాడి గేదెల మృతి

* విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

* ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల విజ్ఞప్తి

మల్లాపూర్, జూన్ 22 (ప్రజా శంఖారావం):

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ఓ రైతు పాడిపంటలో భాగమైన గేదెలు మృతి చెందాయి. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో గత వారం రోజుల క్రితం ఈదురు గాలులతో కూడిన వర్షాలకు గ్రామంలోని గేదెల మంద వద్ద ఉన్న విద్యుత్ స్తంభం విరిగిపోయింది. విద్యుత్ స్తంభానికి ఉన్న విద్యుత్ తీగలు నిర్లక్ష్యంగా వదిలేయడంతో అది గమనించని రైతులు గేదెలను శనివారం మందలోకి పంపారు. దింతో గేదెలకు విద్యుత్ తీగలు తగిలి మృతి చెందినట్లు రైతులు వాపోయారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకొని మృతి చెందిన గేదెల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.