G-L53TNVHN5Y ఏసీబీ అధికారుల దాడులు కలకలం.. ! | Praja Shankaravam

ఏసీబీ అధికారుల దాడులు కలకలం.. !

 

* బాధితుని ఫిర్యాదుతో రంగంలోకి అధికారులు
* లంచగొండి అధికారి కోసం ఏసీబీ రెక్కి
* రెక్కీ పసిగట్టి పరారైన సదరు అధికారి..!

రాయికల్, జూన్ 22 (ప్రజా శంఖారావం):

ACB officials’ searches were futile… జగిత్యాల జిల్లాలో అర్ధరాత్రి ఏసీబీ అధికారుల దాడులు కలకలం సృష్టించాయి. రాయికల్ మండల కేంద్రంలోని ఓ ప్రభుత్వ అధికారి లంచం డిమాండ్ చేయడంతో సదరు ఫిర్యాదు దారుడు ఎసిబి అధికారులను ఆశ్రయించినట్లు సమాచారం. దీంతో రంగంలోకి దిగిన అధికారులు లంచం డిమాండ్ చేసిన అధికారిని పట్టుకునేందుకు శుక్రవారం అర్థ రాత్రి రాయికల్ లోని ఆ కార్యాలయం వద్ద రెక్కీ నిర్వహించారు. ఫిర్యాదుదారుడు అధికారికి డబ్బులు ముట్ట చెప్పేందుకు వెళ్లగా అది పసిగట్టిన అధికారి అక్కడి నుండి పారిపోయినట్లు సమాచారం. ఈ విషయం కాస్త బయటకి పొక్కడంతో ఏసీబీ అధికారుల రెక్కీ స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే… సదరు బాధితుని ఇసుక ట్రాక్టర్ విషయంలో ఆ అధికారి 20వేలు లంచం డిమాండ్ చేశారని బాధితుడు ఏసీబీ అధికారుల వద్ద వాపోయినట్లు సమాచారం. ఏసీబీ అధికారుల సూచన మేరకు బాధితుడు ఆ అధికారికి డబ్బులు ఇచ్చే సమయంలో ఏసీబీ అధికారుల రెక్కీని గమనించిన అధికారి అక్కడి నుండి పారిపోయినట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.