G-L53TNVHN5Y తె.యు విద్యార్థులు తినే ఆహారంలో బల్లి | Praja Shankaravam

తె.యు విద్యార్థులు తినే ఆహారంలో బల్లి

 

* ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
* విషయం బయటకు పోకుండా జాగ్రత్త పడ్డ అధికారులు
* వంట మనిషి, యూనివర్సిటీ కాంట్రాక్టర్ పై చర్యలు
* నాసిరకం భోజనం పెడుతున్నారని యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళన

తె.యు యూనివర్సిటీ, జూన్ 22 (ప్రజా శంఖారావం):

Lizard in rice eaten by students of Telangana University… నిజమాబాద్ జిల్లా డిచ్పల్లి లోని తెలంగాణ యూనివర్సిటీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయం బయటకు తెలియకుండా యూనివర్సిటీ అధికారులు జాగ్రత్త పడ్డారు. యూనివర్సిటీ విద్యార్థులు తినే భోజనంలో బల్లి రావడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. నాసిరకం భోజనం పెడుతున్నారని మండిపడ్డారు. విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డ, ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. శుక్రవారం యూనివర్సిటీ విద్యార్థులు తినే ఆహారంలో బల్లి రావడంతో అధికారులు గుట్టు చప్పుడు కాకుండా విచారణ చేశారు. దీనికి సంబంధించి వంట మనిషిని సస్పెండ్ చేస్తూ యూనివర్సిటీకి కాంట్రాక్టు సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్ కు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. సదరు కాంట్రాక్టర్ నాసిరకం కూరగాయలు సరఫరా చేయడంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు విద్యార్థులు వాపోతున్నారు. నాసిరకం వంట సరుకులు సరఫరా చేస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడిన సదరు కాంట్రాక్టర్ కాంట్రాక్టును రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నాసిరకం సరుకులు సరఫరా చేస్తున్న యూనివర్సిటీ రిజిస్టర్ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల ప్రాణాలు అంటే లెక్క లేదా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సదరు కాంట్రాక్టర్ కు యూనివర్సిటీ పెద్దలకు ఉన్న లోపాయికార ఒప్పందమే విద్యార్థులు తినే ఆహారం కలుషితం కావడానికి ముఖ్య కారణమని పలువురు విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి సదరు అధికారులతో పాటు కాంట్రాక్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. యూనివర్సిటీకి సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్ కాంట్రాక్టు రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.