G-L53TNVHN5Y మైనర్ బాలికపై అత్యాచారం | Praja Shankaravam

మైనర్ బాలికపై అత్యాచారం

 

* పోలీసుల అదుపులో వృద్ధుడు
* స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు

రాయికల్, జూన్ 23 (ప్రజా శంఖారావం):

మానవత్వం పరిమళించి సాటి మనిషికి సాయపడాల్సింది పోయి మానవత్వం మరిచి మృగాళ్ల ప్రవర్తిస్తున్నారు. మనిషి పై సాటి మనిషి మృగంలా ప్రవర్తిస్తూ, తారతమ్య భేదాలు లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పుట్టిన మనిషి జన్మకు సార్థకత చేసుకునే దిశగా మనిషి జీవించాలన్న బోధనలు మనుషులపై ప్రభావం చూపడం లేదా?. అనేక చోట్ల ఆధ్యాత్మికతకు సంబంధించి ప్రవచనాలు జరుగుతున్న మనిషి ప్రవర్తనలో మార్పు రాకపోవడం శోచనీయం…! ఇలాంటి మానవత్వమే మంటగలిపి మృగంలా ప్రవర్తించిన ఘటన ఒకటి జగిత్యాల జిల్లాలోని రాయికల్ పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే … రాయికల్ పట్టణ నడిబొడ్డున మైనర్ బాలికపై హత్యాచారం జరిగిన సంఘటన చోటు చేసుకుంది. 60 సంవత్సరాల వృద్ధుడు మైనర్ బాలిక కు మాయ మాటలు చెప్పి లొంగదీసుకుని బాలిక పై అగాయిత్యానికి పాల్పడ్డా ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలం చేరుకున్న పోలీసులు జరిగిన సంఘటనపై ఆరాతీస్తున్నారు. ఘటనకు కారకుడైన వృద్ధున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.