G-L53TNVHN5Y రాజీనామా యోచనలో వెనక్కి తగ్గిన ఎమ్మెల్సీ..? | Praja Shankaravam

రాజీనామా యోచనలో వెనక్కి తగ్గిన ఎమ్మెల్సీ..?

 

* ఎమ్మెల్సీ తో మాట్లాడిన కేసి వేణుగోపాల్
* డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు బుజ్జగింపులు
* పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ..?
* మంత్రి పదవి ఇచ్చే అవకాశం..?

జగిత్యాల జిల్లా ప్రతినిధి, జూన్ 25 (ప్రజా శంఖారావం):

The MLC backed down on the resignation plan… తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచిందన్నట్లుగా తయారైంది జగిత్యాల కాంగ్రెస్ పార్టీ చిచ్చు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. తాజాగా ఆ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలకపూనారు. బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరితే తనకు మంచి భవిష్యత్తు ఉంటుందనుకున్న ఆ ఎమ్మెల్యే ఆశలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలకతో ఆవిరి అయినట్టుగా కనబడుతున్నాయి. తాను తలిస్తే దైవం మరొకటి తలచిందన్న సామెత ఇప్పుడు నిజమయ్యే విధంగా కనబడుతుంది. ఎమ్మెల్సీ తన అలకతో పాటు మరో అడుగు ముందుకేసి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పడంతో ఆయనకు పార్టీలో బుజ్జగింపుల పర్వం మొదలైంది. ఒక దశలో మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారం కూడా జోరుగా కొనసాగుతుంది. అలాగే జరిగితే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఓడిన గెలిచినట్టు అవుతుంది. ఎమ్మెల్సీ కోటాలో ఆయనకు మంత్రి పదవి వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు ఆయన సన్నిహితులు, పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుకుంటున్నారు. ఇక అసలు విషయానికొస్తే తనను కాదని బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై గుర్రుగా ఉన్న ఎమ్మెల్సీ హుటాహుటిన హైదరాబాద్ వెళ్లి పార్టీ పెద్దలను కలిసే పనిలో ఉన్నారు. ఒక దశలో శాసనమండలిలో తన రాజీనామాను కూడా సమర్పించేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. కానీ పార్టీ పెద్దల బుజ్జగింపుతో హై కమాండ్ ఇచ్చిన గట్టి హామీతో కాస్త వెనక్కి తగినట్లు సమాచారం. కొన్ని పత్రిక ఛానల్లో నేరుగా మాట్లాడిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనని, పార్టీ నియమాలకు కట్టుబడి ఉంటానని మీడియా ముఖంగా చెప్పారు.

◆ ఎమ్మెల్సీ తో మాట్లాడిన కేసి వేణుగోపాల్

జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కెసి వేణు గోపాల్ ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పార్టీలో చేర్చుకోవడంపై ఆయనను సముదాయించినట్లు తెలుస్తోంది. దీంతోపాటు పార్టీ తనకు అండగా ఉంటుందని, పార్టీలో ఎమ్మెల్సీకి సమచితస్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. మంత్రి పదవి కూడా ఇస్తారన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా కొనసాగుతుంది.

◆ డిప్యూటీ సీఎం, మంత్రి బుజ్జగింపులు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో పాటు మంత్రి శ్రీధర్ బాబులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బుజ్జగించినట్లు సమాచారం. తన నియోజకవర్గంలో మరో పార్టీలో వారిని చేర్చుకోవడంపై ఆయన కాస్త అలకబోనారు. ఈ నేపథ్యంలో పార్టీ హై కమాండ్ పెద్దల ఆదేశాల మేరకు ఆయనను సముదాయించి పార్టీకి నష్టం జరగకుండా చూడాలన్న పెద్దల మాటలతో డిప్యూటీ సీఎం, మంత్రి ఆయనను బుజ్జగించారు. ఒక దశలో వారి మాటను కూడా ఎమ్మెల్సీ కాదన్నట్లు తెలుస్తుంది. కానీ ఎట్టకేలకు పార్టీ హైకమాండ్ పెద్దలు ఇచ్చిన హామీతో ఆయన చల్లబడ్డట్లు సమాచారం. జీవన్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా యోచనలో వెనక్కి తగ్గారని, ఇప్పట్లో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే ఆలోచన లేదని ఆయన సన్నిహితులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.