G-L53TNVHN5Y కూతురుతో కలిసి తల్లి ఆత్మహత్య | Praja Shankaravam

కూతురుతో కలిసి తల్లి ఆత్మహత్య

 

జగిత్యాల జిల్లా ప్రతినిధి, జూన్ 27 (ప్రజా శంఖారావం):

బావిలో దూకి కూతురుతో కలిసి తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండల పరిధిలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే సారంగపూర్ మండలం అర్పపల్లి గ్రామానికి చెందిన మౌనిక తన నాలుగేళ్ల కుమార్తెతో బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.