G-L53TNVHN5Y తాటిచెట్టు పైనుండి పడి ఒకరి మృతి | Praja Shankaravam

తాటిచెట్టు పైనుండి పడి ఒకరి మృతి

 

మెట్ పల్లి, జూన్ 27 (ప్రజా శంఖారావం):

One died by accident… తాటిచెట్టు పైనుంచి జారిపడి గీతా కార్మికుడు మృతి చెందిన సంఘటన మెట్ పల్లి మండలంలోని వెల్లుల గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వెల్లుల గ్రామానికి చెందిన జుంగుల గంగాధర్ గౌడ్ కులవృత్తి లో భాగంగా ఎప్పటిలాగే గురువారం ఉదయం గ్రామ సమీపంలోని తాటి కల్లు తీయడానికి చెట్టు ఎక్కడు. ప్రమాదవశాత్తు నడుముకున్న మోకు జారడంతో ఆయన చెట్టుపై నుండి కిందపడి తీవ్రగాయాల పాలయ్యాడు. స్థానికుల సమాచారంతో కుటుంబ సభ్యులు క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.