G-L53TNVHN5Y గుడుంబా స్థావరాల పై మెరుపు దాడులు | Praja Shankaravam

గుడుంబా స్థావరాల పై మెరుపు దాడులు

 

మల్లాపూర్, జూలై 06 (ప్రజా శంఖారావం):

తెలంగాణ రాష్ట్రాన్ని గుడుంబా/సారా రహిత రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో కరీంనగర్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్, జగిత్యాల జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ సత్యనారాయణ ఆదేశాల మేరకు మల్లాపూర్ మండలంలోని వివి రావుపేట గ్రామంలో శనివారం గుడుంబా స్థావారాలపై మెరుపు దాడులు నిర్వహించారు. దాడులలో 250 లీటర్ల బెల్లం పాకం ధ్వంసం చేశారు. ఒకరి పై కేసు నమోదు చేశామని, ఆయన వద్ద తయారు చేసే సామాగ్రితో పాటు 6 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి బైండ్ఓవర్ చేసినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో గుడుంబా తయారీదారులను, అమ్మకం దారులను, ఉఫెక్షించేది లేదని ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే పీడీ చట్టం కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సీఐ వినోద్ రాథోడ్, ఎస్ హెచ్ ఓ మెట్ పల్లి, ఎక్సైజ్ ఎస్సై లక్ష్మణ్, పోలీస్ ఎస్ఐ కిరణ్, ఎక్సైజ్, పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.