G-L53TNVHN5Y తెగిన వంతెన.. నిలిచిన రాకపోకలు…! | Praja Shankaravam

తెగిన వంతెన.. నిలిచిన రాకపోకలు…!

 

* వర్షాలకు తెగిన రహదారులు
* రెండు గ్రామాల మధ్య నిలిచిన రాకపోకలు
* పలుచోట్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు

ఇబ్రహీం పట్నం, జూలై 09 (ప్రజా శంఖారావం):

గత కొన్ని రోజులుగా కురుస్తున్న మాములు వర్షాల కె రోడ్లు, వంతెనలు కొట్టుకు పోతున్నాయి. అధికారులు, ప్రజా ప్రతినిధులు వరదల నివారణకు ప్రణాళిక రూపొందించక పోవడం ప్రజా రవాణాకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్, పకీర్ కొండాపూర్ గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన సోమవారం కురిసిన వర్షానికి కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఫకీర్ కొండాపూర్ గ్రామస్తులు జల దిగ్బంధంలో చిక్కుకున్నారు. ప్రస్తుతం అధికారులు సమస్య పరిష్కారం కోసం వెంటనే చర్యలు చేపట్టి తమను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు..

Leave A Reply

Your email address will not be published.