G-L53TNVHN5Y అక్రమ మొరం తవ్వకాలు | Praja Shankaravam

అక్రమ మొరం తవ్వకాలు

 

మెట్ పల్లి, జూలై 10 (ప్రజా శంఖారావం):

మెట్ పల్లి మండలం మెట్ల చిట్టాపూర్ శివారు ప్రాంతంలో ఉన్న సాగు భూమి నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మొరం తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపించారు. ఒక రైస్ మిల్ యజమాని తాను నిర్మిస్తున్న రైస్ మిల్ నిర్మాణానికి అక్రమంగా ఎలాంటి మైనింగ్ శాఖ అనుమతులు లేకుండా మొరం తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గడ్డి కొడుతున్నారు. మొరం తరలింపు పై మైనింగ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపించారు. జెసిబిలు, టిప్పర్ల సహాయంతో మట్టిని తరలిస్తున్నారు. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా మట్టిని, ఇసుక తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు సైతం జారీచేసినప్పటికీని అక్రమార్కులు మాత్రం అవేవీ అంటి ముట్టనట్లుగా నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా మట్టినీ తరలించడంపై స్థానికుల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫిర్యాదు చేసిన అక్రమ మొరం తరలిస్తున్న సదరు రైస్ మిల్లు యజమానిపై చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది.

Leave A Reply

Your email address will not be published.