GST: ₹ 2 వేలు యూపీఐ ట్రాన్సాక్షన్ దాటితే 18% జీఎస్టీ.. నిజమేనా..!

GST
GST

GST: కేంద్ర ప్రభుత్వం 2000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ ట్రాన్సాక్షన్లపై 18 శాతం జీఎస్టీ విధిస్తున్నట్లు ఇటీవల కొన్ని వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో ఆన్లైన్ పేమెంట్స్ తగ్గిపోవచ్చని వార్తలు కూడా వినిపించాయి. అయితే తాజాగా భారత ప్రభుత్వం ఇవన్నీ పుకార్లేనని నిజం కాదని స్పష్టంగా తెలిపింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్టు టాక్సెస్ కస్టమ్స్ బోర్డు ఆన్లైన్ లేదా యూపీఐ పేమెంట్స్ పై జిఎస్టి విధించే ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చింది. ఇటీవల కొన్ని మీడియా నివేదికలు రెండువేల కంటే ఎక్కువ విలువైన యూపీఐ ట్రాన్సాక్షన్ల పై డిజిటల్ సర్వీసులకు సాధారణ రేటు 18% జిఎస్టి విధించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలిపింది.

అయితే ఈ విషయంపై స్పందించిన సిబిఐసి మర్చంట్ డిస్కౌంట్ రేటు వంటి ఫీజులపై మాత్రమే జీఎస్టీ వర్తిస్తుందని తెలిపింది. పర్సన్ టు మర్చంట్ యూపీఐ ట్రాన్సాక్షన్లకు 2020 జనవరి నెల నుంచి ఎండిఆర్ ను తొలగించారు. కాబట్టి అటువంటి వాటిపై జిఎస్టి ఉండదు. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ సిబిఐసి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో పోస్ట్ పెట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం డిజిటల్ పేమెంట్స్ ని ప్రోత్సహించడానికి గత నెలలో రూ.1500 కోట్ల పథకాన్ని ఆమోదించడం జరిగింది.

చిన్న వ్యాపారస్తులకు ఈ పథకం కింద జీరో ఎండిఆర్, 0.15% ఇన్సెంటివ్ అందించడం ద్వారా వ్యాల్యూ బీమ్ యూపీఐ ట్రాన్సాక్షన్ లను ప్రోత్సహించేలా ఉంది. ఏప్రిల్ ఒకటి, 2024 నుంచి మార్చి 31, 2025 వరకు ఈ పథకం అమలులో ఉంది. చిన్న చిన్న వ్యాపారస్తులు డిజిటల్ పేమెంట్లను స్వీకరించేలా ఈ పథకం సహాయపడుతుంది. జిఎస్టి వసూల్లో 2025 మార్చి నెలలో 9.9% పెరిగి రూ. 1.96 లక్షల కోట్లకు చేరుకున్నాయని తెలిపింది. ఇప్పటివరకు ఇది రెండవ అత్యధికం అని చెప్పుకొచ్చింది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now