TGSRTC: బస్సుల ద్వారా ప్రయాణం చేసే వారి కోసం ఆర్టీసీ ఒక గొప్ప న్యూస్ తెలిపింది. ఆర్టీసీ బస్సు ప్రయాణికుల కోసం రెండు కీలక ప్రకటనలు చేసింది. దీంతో ప్రయాణికులకు ఊరట కలుగుతుంది. నిత్యం వేళలో ప్రయాణికులు బస్సుల ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇటువంటి వారి కోసం తాజాగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్న వివిధ ప్రాంతాల నుంచి ఎల్లమ్మ కళ్యాణం కోసం వెళ్లే భక్తులకు జూన్ 30 సోమవారం రోజున 80 కొత్త ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఎల్లమ్మ కళ్యాణం జులై 1, జులై రెండవ తేదీ మధ్యలో బల్కంపేటలో జరుగుతుంది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈ ప్రత్యేక బస్సులు ఎస్ఆర్ నగర్ మీదుగా ప్రయాణిస్తాయని ప్రకటించింది. అలాగే ఈ ఆలయానికి వెళ్లే దారిలో భారీ వాహనాలకు అనుమతి ఉండదు అని తెలిపింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వి సి సజ్జనర్ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పర్యాటక సేవలకు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి దర్శన టికెట్ల జారీని మళ్లీ ప్రారంభించాలని కోరింది. విసి సజన ఆదివారం రోజున విఐపి బ్రేక్ దర్శన సమయం లో తిరుమల దేవాలయాన్ని సందర్శించారు. ఆ తర్వాత ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.
గతంలో ఆరు నెలల క్రితం టీటీడీ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖలకు తిరుమల తిరుపతి దర్శన టికెట్ల కేటాయింపును నిలిపివేసిందని తెలిపారు. దీంతో టూరిజం ఆపరేటర్ల సామర్థ్యాన్ని మరియు తెలంగాణ భక్తులకు అనుకూలమైన తీర్థయాత్ర ఎంపికలను అందించడంలో టీజీఎస్ ఆర్టీసీని కూడా ఈ నిర్ణయం ప్రభావితం చేసింది అని సజ్జనాలు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మళ్ళీ పర్యాటక సేవలకు టికెట్ కోటాను పరిశీలించి మళ్ళి పునరుద్ధరించాలని సృజన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేశారు. ఈ విషయానికి సంబంధించి టికెట్లు కేటాయింపులను తిరిగి ప్రారంభించడానికి ఒత్తిడి తీసుకుని వస్తున్నట్లు తెలిపారు.