Bank e-KYC: బ్యాంకు కస్టమర్లకు ముఖ్యమైన అలర్ట్.. మార్చి 26 లోపు ఈ ప్రాసెస్ పూర్తి చేయాలి.. లేకపోతే అకౌంట్ బ్లాక్

Bank e-KYC
Bank e-KYC

Bank e-KYC: బ్యాంకు ఖాతాను మెయింటైన్ చేసేవారికి ప్రభుత్వం ఒక ముఖ్యమైన అలర్ట్ ప్రకటించింది. ప్రభుత్వరంగ బ్యాంక్ కస్టమర్లకు ఒక విషయం గురించి ఇటీవలే వార్నింగ్ ఇచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వెంటనే నో యువర్ కస్టమర్ సమాచారాన్ని అప్డేట్ చేయాలని కొంతమంది కస్టమర్లకు కోరింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రకటన తాజాగా విడుదల చేసింది. ఇప్పటివరకు కేవైసీ అప్డేట్ చేయని పంజాబ్ నేషనల్ బ్యాంక్ వినియోగదారులు బ్యాంక్ అకౌంట్ విషయంలో సమస్యలను ఎదుర్కోవచ్చు.

అయితే ఈ ప్రకటన డిసెంబర్ 31 2024 నాటికి కేవైసీ అప్డేట్ చేయని వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఒకవేళ మీ అకౌంట్ కి కేవైసీ అప్డేటెడ్ గా ఉంటే ఏం చేయాల్సిన అవసరం లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం డిజిటల్ కేవైసీ కూడా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో వినియోగదారుని లైవ్ ఫోటో తీసుకుంటారు. అలాగే అధికారిక ఐడి ఫోటోను క్యాప్చర్ చేస్తారు. ఫోటో తీసిన లోకేష్ ను రికార్డు కూడా చేస్తారు. ఈ ప్రక్రియను పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధర్ ఆఫీసర్ లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియంత్రణలోని ఏదైనా ఇతర బ్యాంక్ అయినా చేయవచ్చు.

మీరు దగ్గరలోని ఏదైనా పంజాబ్ నేషనల్ బ్రాంచ్ కి వెళ్లి కేవైసీ ప్రాసెస్ ను అప్డేట్ చేసుకోవచ్చు. ఇంటి దగ్గర నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ONE యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీసెస్ కూడా ఉపయోగించుకోవచ్చు. లేదా మీ అకౌంట్ ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్ కి ఈమెయిల్ లేదా పోస్ట్ ద్వారా డాక్యుమెంట్స్ ను పంపించవచ్చు. మీరు వినియోగిస్తున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంట్ కి ఎటువంటి సమస్య రాకూడదు అనుకుంటే మార్చి 26, 2025 లోపు కేవైసీ అప్డేట్ ను పూర్తి చేసుకోవాలి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వినియోగదారులు కొన్ని డాక్యుమెంట్లను బ్యాంకులో సబ్మిట్ చేసి కేవైసీ ప్రాసెస్ ను అప్డేట్ చేసుకోవచ్చు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now