NEW SCHEME: పోస్ట్ ఆఫీస్ అద్భుతమైన స్కీం.. కేవలం రూ. 565 తో రూ.10 లక్షలు పొందచ్చు

NEW SCHEME
NEW SCHEME

NEW SCHEME: పోస్ట్ ఆఫీస్ లో ఇప్పటివరకు అనేక అద్భుత పథకాలు సామాన్య ప్రజల కోసం అందుబాటులోకి వచ్చాయి. తక్కువ ప్రీమియంతో అదిరిపోయే బెనిఫిట్ ఉన్న పథకాలు కూడా పోస్ట్ ఆఫీస్ లో ఉన్నాయి. ఈ పథకంతో ఏకంగా రూ.10 లక్షలు అందుకోవచ్చు. పోస్ట్ ఆఫీసు అత్యల్ప ప్రీమియంతో భారీ భీమా రక్షణతో ప్రజల కోసం ప్రత్యేక వ్యక్తిగత ప్రమాద బీమా పథకాన్ని అమలులోకి తెచ్చింది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని పోస్ట్ ఆఫీస్ ఇప్పటివరకు అనేక పథకాలను అమలు చేసింది.

కానీ బయట ఈ పథకాలు ప్రజల్లో పూర్తిస్థాయి వరకు వెళ్లలేదని వాదన వినిపిస్తుంది. కానీ పోస్ట్ ఆఫీస్ వాళ్లను సంప్రదించినట్లయితే అనేక రకాల అద్భుతమైన పథకాలు అందుబాటులో ఉన్నాయని తెలుసుకోవచ్చు. తాజాగా ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ లో కొత్త పథకం వచ్చింది. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం మరియు మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని తాజాగా పోస్ట్ ఆఫీస్ అటువంటి వారికి ఆపద సమయంలో రక్షణ కలిగించే ఒక ఉత్తమ వ్యక్తిగత ప్రమాద బీమా పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ. 565 లేదా రూ. 345 ప్రీమియంతో వరుసగా ఈ పథకంలో ఐదు లక్షలు లేదా పది లక్షల వరకు బీమా పొందవచ్చు.

ఈ పథకానికి అందరూ అర్హులే..

18 నుంచి 65 ఏళ్ల వయస్సు ఉన్న మహిళలు అలాగే పురుషులు అందరూ ఈ పథకాన్ని నమోదు చేసుకోవచ్చు. ఈ పథకంలో రెండు బీమాలు ఉంటాయి. అందులో ఒకటి రూ. 565 ప్రీమియానికి 10 లక్షల బీమా అలాగే రెండవది రూ. 345 ప్రీమియానికి ఐదు లక్షల బీమా ఉంటుంది. ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత వైకల్యం కలిగిన వారికి ఐదు లక్షల నుంచి 10 లక్షల వరకు నామినిగా లభిస్తుంది. శారీరక వైకల్యం పూర్తిగా సంభవిస్తే ఐదు లక్షల నుంచి 10 లక్షల వరకు బీమా అందుతుంది. ఒకవేళ ప్రమాదం జరిగితే వైద్య ఖర్చులకు 50 వేల నుంచి ఒక లక్ష వరకు భర్తీ అందుతుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now