Pension: త్వరలో పెన్షన్ అమౌంట్ పెరగబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. గత కొన్ని ఏళ్ల నుంచి మన దేశంలోని కార్మిక సంఘాలు పెన్షన్ గ్రూపులు ఈపీఎస్ 95 గా పేర్కొనే ఎంప్లాయిస్ పెన్షన్స్ కీమా కింద పెన్షనర్లు పెన్షన్ అమౌంట్ పెంచాలని డిమాండ్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ రోజుల్లో జీవనవయాలు పెరుగుతున్నా కూడా ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వెయ్యి రూపాయలుగా 2014లో నిర్ణయించిన మినిమం పెన్షన్ అమౌంట్ ని మాత్రం అప్డేట్ చేయడం లేదు.
పార్లమెంటరీ కమిటీ ఇది డిమాండ్లను పరిష్కరించడానికి ఈ స్కీమ్ థర్డ్ పార్టీ రివ్యూ కి పిలిపించింది. ఈ క్రమంలో పెన్షన్ అమౌంట్ పెరిగే అవకాశం ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈపీఎస్ 95 1995లో ప్రారంభించిన పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు స్థిరమైన ఆదాయాన్ని అందించే పథకంగా చెప్తారు. ఈపీఎఫ్ఓ సభ్యులకు ప్రయోజనాలను కలిగించడానికి కనీసం 10 సంవత్సరాలు పెన్షన్ ప్లాన్ కి కాంట్రిబ్యూట్ చేస్తుంది.
దాంతో పదేళ్ల క్రితం నిర్ణయించిన వెయ్యి రూపాయల మినిమం పెన్షన్ ప్రస్తుతం పెన్షనర్లకు ఏమాత్రం సరిపోదు. బిజెపి ఎంపీ బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని పార్లమెంటు కమిటీ దీనిపై త్వరగా చర్యలను తీసుకోవాలని కేంద్ర కార్మిక శాఖను కోరింది. ఈ క్రమంలో ఎంప్లాయిస్ పెన్షన్స్ థర్డ్ పార్టీ అవల్యూషన్ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్స్ నిర్వహించాలని కమిటీకి పిలుపునిచ్చింది. ఈ పథకాన్ని రివ్యూ చేసి ఇంప్రూవ్మెంట్స్ ని సూచించే లక్ష్యంతో ఈ పథకం ఉంటుంది.
గడిచిన 30 ఏళ్లలో ఇటువంటి రివ్యూ జరగడం ఇదే తొలిసారి. దీనికి సంబంధించి పూర్తి పనులను 2025 లోపు పూర్తిచేసే విధంగా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించి కమిటీ రిపోర్టు తక్షణ చర్యలు తీసుకోవాలని హైలైట్ కూడా చేసింది. 2014 నుంచి జీవన వ్యయం అనేక రెట్లు పెరిగిన సంగతి తెలిసిందే. కానీ పెన్షన్ మొత్తం అలాగే ఉందని తెలుపడం జరిగింది. ఈ క్రమంలో పానెల్ అత్యవసర భావనతో ఈ విషయాన్ని పరిగణించి కనీస పెన్షన్ పెంచడాన్ని పరిగణించాలని మంత్రిత్వ శాఖను కోరింది.