Tollywood: ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇతను ఇండస్ట్రీలో అజిత్, షారుక్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో కూడా కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. తనదైన నటన శైలితో ప్రేక్షకులను మెప్పించాడు. కానీ ఇప్పుడు మాత్రం సినిమాలను పూర్తిగా వదిలేసి వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. సినిమా ఇండస్ట్రీలో హీరో మరియు హీరోయిన్లతో పాటు సహాయ నటీనటులు కూడా బాగా పాపులర్ అవుతారు. వాళ్లు కూడా తమ నటనతో ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంటారు.
స్టార్ హీరోలకు దీటుగా తమ సహజమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తారు. అయితే ఒకప్పుడు సహాయ నటుడుగా పేరు తెచ్చుకున్న చాలామంది ఇప్పుడు మాత్రం సినిమాలను మానేసి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఇటువంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే నటుడు కూడా ఒకరు. ఒకప్పుడు ఇతను సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి నటుడిగా ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నాడు. స్టార్ హీరోలతో కూడా కలిసిన నటించాడు. కానీ ఇప్పుడు మాత్రం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వాచ్మెన్ గా జీవితం సాగిస్తున్నాడు.
ఇతను ప్రస్తుతం ముంబైలో ఉన్న ఒక అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తున్నట్లు కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నటుడి పేరు సావి సిద్ధూ. ఇతను హిందీలో గులాల్, బ్లాక్ ఫ్రైడే, పటియాల హౌస్ వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి బాగా ఫేమస్ అయ్యాడు. ఇక కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తో కలిసి ఆరంభం సినిమాలో నటించాడు. కానీ ఇప్పుడు మాత్రం ఇతను సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ముంబైలో ఒక అపార్ట్మెంట్లో వాచ్మెన్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన ఈ నటుడు తన ఆరోగ్యం క్షీణించడం వలన సినిమాలకు విరామం ఇచ్చినట్టు తెలిపాడు. కానీ ఇప్పుడు తను సినిమా ఇండస్ట్రీలోకి మళ్ళీ అడుగు పెట్టడం చాలా కష్టం అని తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడం కోసం ఒక అపార్ట్మెంట్లో వాచ్మెన్ గా పనిచేస్తున్నట్లు తెలిపాడు.