STATE MINISTERS: ప్రజా శంఖారావం, వెబ్ డెస్క్: రాష్ట్ర మంత్రులకు జిల్లా పర్యటన నిమిత్తం వచ్చిన సమయంలో పెను ప్రమాదం తప్పింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రైతు మహోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు లు పెను ప్రమాదం నుండి బయటపడ్డారు.
రైతు మహోత్సవ సభా ప్రాంగణం వద్ద హెలిక్యాప్టర్ ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా గాలి దుమ్ము వీయడంతో స్వాగత వేదిక తోరణాలు గాలి దాటికి ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఈ ఘటనలో పలువురు పోలీసు సిబ్బందికి గాయాలైనట్లుగా సమాచారం. ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో సభా ప్రాంగణానికి వచ్చిన ప్రజలు, నాయకులు కాసేపు అయుమయానికి గురై పరుగులు తీశారు.
రైతు మహోత్సవ వేడుక కార్యక్రమం సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రదర్శన స్టాళ్లు కొన్ని ధ్వంసమయ్యాయి. సభా ప్రాంగణానికి కొద్ది దూరంలోనే మంత్రులు వచ్చిన హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి ఏర్పాట్లు చేయడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. రైతు మహోత్సవ వేదిక ఏర్పాట్లలో అధికారులు జాగ్రత్తలు పాటించలేదని జనం మండిపడుతున్నారు.