UAE Golden Visa: దుబాయ్ కి కొత్త రకం గోల్డెన్ వీసా.. ఇది మంచి అవకాశం.. అస్సలు మిస్ అవ్వద్దు

UAE Golden Visa
UAE Golden Visa

UAE Golden Visa: ఈమధ్య కాలంలో గోల్డెన్ వీసాకు ప్రజలలో ఎక్కువ ఆదరణ కలిగింది. గోల్డెన్ వీసా యూఏఈ ఆమోదిస్తుంది. కొత్త రకం గోల్డెన్ వీసా లను అందించేందుకు ప్రస్తుతం యూఏఈ రెడీగా ఉంది. యూఏఈ స్థిరాస్తి కొనుగోలు చేసేందుకు, వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వంటి వాటికీ నామినేషన్ ఆధారంగా చేసుకుని గోల్డెన్ వీసాలను జారీ చేస్తుంది. ముందుగా యూఏఈ ప్రయోగాత్మకంగా బంగ్లాదేశ్ మరియు భారతదేశ వాసులకు ఈ వీసాలను మంజూరు చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది. మనదేశంలో రయాద్ గ్రూప్ అనే కన్సల్టి ద్వారా మన దేశ వాసులకు ఈ వీసాలను మంజూరు చేయనుంది.

ఇప్పటివరకు మన దేశం నుంచి దుబాయ్ కి గోల్డెన్ వీసా పొందే మార్గాలలో 20 లక్షల ఏ ఈ డి స్థిరాసిలే కొనుగోలు చేయడం లేదా వ్యాపారంలో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడం కూడా ఒకటిగా ఉండేది. ఈ మధ్యకాలంలో కొత్తగా ప్రవేశపెట్టిన నామినేషన్ ఆధారంగా వీసా విధానంలో లక్ష ఏ ఈ డి ఫీజు చెల్లించడం వలన కూడా గోల్డెన్ వీసా జీవితకాలం చెల్లుబాటు అయ్యేలాగా పొందవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు సంబంధిత వర్గాలు తాజాగా ఓ వార్త సంస్థకు తెలిపాయి.

మన దేశ వాసులు 5,000 మందికి పైగా కేవలం మూడు నెలల ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకుంటారు అని కూడా నివేదికలు అంచనా వేస్తున్నాయి. రాయాద్ గ్రూప్ ఎండి రాయాద్ కమల్ అయూబ్ మన దేశవాసులు యూఏఈ గోల్డెన్ వీసాను పొందెందుకు ఇది మంచి అవకాశం అని చెప్పుకొచ్చారు. ముందుగా ఈ వీసా కోసం అప్లై చేసుకున్న వారి నేపథ్యాన్ని తనకి చేయడం జరుగుతుంది. క్రిమినల్ రికార్డులు, సోషల్ మీడియా తనిఖీలు అలాగే యాంటీ మనీ లాండరింగ్ వంటివి కూడా చేస్తారు. ప్రభుత్వానికి తుది నిర్ణయం కోసం సంబంధించిన దరఖాస్తులను పంపిస్తారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now