ACB Rides: ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి

ACB Arrest Panchayathi Sec
ACB Arrest Panchayathi Sec

ACB Rides: ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి

నిర్మల్ జిల్లా ప్రతినిధి, జూన్ 24 (ప్రజా శంఖారావం): నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం గూడ్సేరియల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి (Secretary)గా పని చేస్తున్న మర్రి శివకృష్ణ (Marri Shivakrishna) లంచం తీసుకుంటూ మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డారు. బాధితుని ఫిర్యాదు మేరకు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఇంటి నెంబర్స్ కేటాయించేందుకు సదరు బాధితుని వద్ద పంచాయతీ కార్యదర్శి రూ.12వేలు లంచం డిమాండ్ చేసి (Demanded a bribe of 12 Thousand Rupees) డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ (Red Handed)గా పట్టుకున్నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపారు.

ఏదైనా ప్రభుత్వ శాఖలోని ఉద్యోగులు లంచం డిమాండ్ చేసినట్లయితే అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 1064 తో పాటు 9440446106 వాట్సాప్ నెంబర్ కు సంప్రదించాల్సిందిగా అవినీతి నిరోక్షక అధికారులు కోరారు. తమ దృష్టికి వచ్చిన ఫిర్యాదు దారుని (బాధితుల) పేర్లు గోప్యంగా ఉంచుతామని వారు వెల్లడించారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now