ACB TRAP: ప్రజా శంఖారావం, వెబ్ డిస్క్: అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా లంచం తీసుకుంటూ మహిళా అధికారులు వరుసగా పట్టబడుతున్నారు. రాష్ట్రంలో ఏసీబీ (ACB TRAP) అధికారులకు పట్టుబడుతున్న వరుస మహిళ అధికారులను చూస్తే ఆందోళన కలుగుతుంది. మగవారి కంటే తామేమి తీసిపోము అన్నట్లుగా మహిళా అధికారులు (FEMALE OFFICERS) కూడా లంచాలు తీసుకుంటూ పట్టుబడడం ఆశ్చర్యంగా ఉందంటూ పలువురు మహిళా ఉన్నతాధికారులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు.
Also Read:ఏసీబీ వలలో ఉప రాష్ట్ర పన్నుల అధికారి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ (ASST LABOUR OFFICER) పాక సుకన్య (PAAKA SUKANYA) రూ.30 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఆమెకు సహకరించిన ఆమె ప్రైవేట్ అసిస్టెంట్ మోకినేపల్లి రాజేశ్వరిని కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు తన భర్తకు సంబంధించిన సహజ మరణ దావా, అంత్యక్రియల ఖర్చుల దస్తవేజును ప్రాసెస్ చేసి, దాన్ని ఉన్నతాధికారుల అనుమతి కోసం పంపడానికి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రూ.30వేలు లంచం డిమాండ్ (THURTY THOUSAND DEMAND) చేసినట్లు ఏసీబి ఆధికారులు తెలిపారు. బాధితురాలి వద్ద రెడ్ హ్యాండెడ్ గా రూ.30వేలు లంచం తీసుకుంటుండగా ఆమె పట్టుకున్నట్లుగా ఏసీబీ అధికారులు చెప్పారు.
Also Read:నెలనెలా రూ. 500 పొదుపు.. మంచి రిటర్న్స్.. ఎలానో తెలుసుకోండి..