Male Ear Piercing: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అబ్బాయిలు చెవులు కుట్టించుకుంటే.. కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే

Male Ear Piercing
Male Ear Piercing

Male Ear Piercing: పురుషులు చెవులు కుట్టించుకోవడం కూడా మనదేశంలో అనేక నాగరికతలలో ఒక సాధారణ ఆచారంగా పరిగణిస్తున్నారు. కర్ణ వేద అనే వేడుకలో మనదేశంలో చాలామంది అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా చెవులు కుట్టడం జరుగుతుంది. అయితే జన్మదిన వేడుక సందర్భంగా కర్ణ వేద ముహూర్తం ప్రకారం వీటిని నిర్వహిస్తారు. మరి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పురుషులు చెవులు కుట్టించుకుంటే లాభాలు కలుగుతాయ అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మన దేశంలో పురుషులు హిందూ పురాణాల ప్రకారం చెవులు కుట్టించుకున్నట్లయితే వాళ్లు చెడు దృష్టి నుంచి తప్పించుకోవచ్చు. వాళ్లు బంగారం లేదా రాగి చెవి పోగులను ధరించడం వలన వారికి ప్రతి కుల శక్తి దూరంగా ఉంటుంది అని నమ్ముతారు.

వాళ్లు తరచుగా అనారోగ్యానికి కూడా గురి కాకుండా ఉంటారు అని చాలామంది నమ్మకం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొంతమంది పురుషులు ఎడమ లేదా కుడివైపున చెవులు కుట్టించుకోవడం వలన వాళ్ళ జాతకంలో ఉన్న రాహువు, కేతువు ప్రతికూల ప్రభావాలు తగ్గిపోతాయి అని చెప్తున్నారు. అలా కొట్టించుకోవడం వలన వాళ్ళ జాతకంలో తొమ్మిది గ్రహాల స్థానం బాగా బలపడుతుంది. ఈ విధంగా జాతకంలో రాహువు మరియు కేతువుల స్థానం బలబడినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఉండవు. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది.

మన శరీరంలో ఉన్న అత్యంత సునీతమైన ప్రాంతాలలో చెవిలోబ్ కూడా ఒకటి అని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఎవరైనా చెవి కొట్టించుకుంటే వాళ్ళ మనసు చాలా ప్రశాంతంగా మారుతుంది. అలాగే పురుషులు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చెవులు కుట్టించుకోవడం వలన వాళ్ళ తలలో తిరుగుతున్న ప్రతికూల ఆలోచనలు కూడా తొలగిపోతాయి అని చెప్తున్నారు. అబ్బాయిలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చెవులు కుట్టించుకోవడం వలన మరింత ధైర్యంగా మారతారట. ఆధ్యాత్మిక వృద్ధి కూడా పెరుగుతుంది అలాగే పవిత్ర శబ్దాలు కూడా వినడానికి బాగా సహాయపడుతుంది

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now