Vastu Shastra: వాస్తు ప్రకారం స్పటిక శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల.. ఏం జరుగుతుందో తెలుసా..!

Vastu Shastra
Vastu Shastra

Vastu Shastra: విగ్రహారాధన గురించి హిందూ ధర్మశాస్త్రంలో చాలా విషయాలు చెప్పబడ్డాయి. ముఖ్యంగా శివలింగాన్ని సైవులు శివారాధన చేయడానికి ఇంట్లో పెట్టుకుంటారు. రాతితో కానీ లేదా లోహాలతో కానీ శివలింగాలను తయారు చేస్తారు. స్పటిక శివలింగానికి మాత్రం చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే స్పటిక శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చా లేదా ఉంచుకోవడం వలన ఇంట్లో ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వచ్ఛతకు మరియు పవిత్రతకు ప్రతీకగా స్పటికం భావిస్తారు. కాబట్టి ఇటువంటి స్పటిక శివలింగాన్ని ఇంట్లో పెట్టుకున్నట్లయితే సాక్షాత్తు శివుడిని స్వరూపాన్ని సంతరించుకున్నట్టే అంటూ చెబుతున్నారు.

ఇంట్లో దీనిని పూజిస్తే చాలా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇంట్లో సానుకూల శక్తులు పెరగడంతో పాటు అన్ని శుభాలే జరుగుతాయి. అయితే శివుడిని పూజించేవారు ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవచ్చా అని అనుకుంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుని పూజించవచ్చు. కానీ దీని పరిమాణం మాత్రం బొటన వేలంతా మాత్రమే ఉండాలని నిపుణులు చెప్తున్నారు. వాస్తు రిత్య అంతకంటే ఎత్తైన శివలింగం ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదు అంటూ నిపుణులు సూచిస్తున్నారు.

బొటనవేలు కంటే చిన్న పరిమాణంలో ఉన్న శివలింగాలు కూడా ఇంట్లో చాలా శ్రేయస్కరం. దీనిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి. శివలింగాన్ని నిత్యం పండ్ల రసం, పాలు, పరిశుభ్రమైన నీటితో అభిషేకం చేస్తూ ఉండాలి. ఆ తర్వాత పువ్వులతో అలంకరించి, నైవేద్యాలు సమర్పించాలి. ఇంట్లో ఈ లింగాన్ని ఈశాన్యం మూలలో, ఉత్తర దిశలో పెట్టడం చాలా శుభప్రదంగా భావిస్తారు. నేరుగా ఈ శివలింగాన్ని నేలపై కాకుండా చెక్క లేదా పాలరాతి పీఠంపై పెట్టాలి. అయితే ఈ శివలింగాన్ని ఇంట్లో ఉంచుకున్నప్పుడు నిత్యం అభిషేకం చేయడం, పూజ చేయడం చేస్తూ ఉండాలి. నిత్యం ఇంట్లో పెట్టుకున్న శివలింగంపై జలధారపడేలాగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ విధంగా చేయడం వలన శివలింగ శెట్టి ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంచుతుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now