Sonu Sood: అంబదాస్ పవర్ అనే రైతుకు ప్రస్తుతం 76 ఏళ్లు. అతనికి ఒక పొలం కూడా ఉంది. కానీ ఆ పొలాన్ని దున్ని ఖర్చు చేసే అంత స్తోమత ఆ రైతుకు లేదు. దాంతో ఆ భార్య భర్తలు ఇద్దరూ కలిసి తమ పొలం దున్నడానికి నాగలి అంటే ఒక పరికరాన్ని తయారు చేసుకున్నారు. తాజాగా స్టార్ నటుడు సోనూసూద్ ఆ రైతుకు సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. ఇక నటుడు సోను సూద్ గురించి ప్రతి ఒక్కరికి బాగా తెలుసు. అతను కరోనా మహమ్మారి సమయంలో ఎంతోమందికి సాయం చేసే ఎంతోమంది ప్రాణాలను కాపాడారు.
ఇప్పటికీ కూడా తన దగ్గరకు సాయం కోసం వచ్చిన వారికి అలాగే అర్హులైన వారికి నటుడు సోను సూద్ సాయం చేస్తూనే ఉన్నారు. తాజాగా రైతు కష్టానికి చలించిపోయిన నటుడు అతనికి సాయం చేయడానికి ఒక అదిరిపోయే గిఫ్ట్ అందించినట్లు సమాచారం. అంబాదాస్ పవర్ మహారాష్ట్ర కు చెందిన 76 ఏళ్ల రైతు. అతనికి పొలం ఉన్నప్పటికీ కూడా ఆ పొలాన్ని ఖర్చుపెట్టి దున్నుకునే అంత స్తోమత లేదు. దాంతో తమ పొలం దున్నుకోవడానికి ఆ భార్య భర్తలు ఇద్దరు కలిసి ఒక పరికరాన్ని తయారు చేసుకున్నారు. ఆ పరికరంతో వాళ్ళిద్దరూ తమ పొలాన్ని దున్నుకున్నారు.
ఈ మధ్యకాలంలో ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో బాగా వైరల్ అయింది. ఈ వైరల్ వీడియో నటుడు సోను సూద్ దృష్టికి కూడా వెళ్లడంతో ఈ వృద్ధ దంపతుల కష్టానికి చలించిపోయిన నటుడు వాళ్లకు సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. ఎక్స్ ఖాతాలో సోను సూద్ మన రైతుకు ట్రాక్టర్ నడపడం రాదు కాబట్టి ఆయనకు ఎద్దులను గిఫ్ట్ గా ఇస్తున్నాను అంటూ తెలిపాడు. సామాజిక మాధ్యమాలలో నటుడు సోను సూద్ కు అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.